- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నిరుద్యోగులను పొట్టన పెట్టుకుంటున్న కేసీఆర్ సర్కార్’
దిశ, షాద్‌నగర్: తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులను కేసీఆర్ సర్కార్ పొట్టన పెట్టుకుంటుందని నిరుద్యోగ ఉద్యమ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ చమార్, ఓయూ జేఏసీ చైర్మన్ కల్వకుర్తి ఆంజనేయులు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజులు కట్టలేక, ఉద్యోగాలు లేక తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయని, ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆగస్టు 6వ తేదీన పరామర్శించబోతున్నట్టు తెలిపారు.
ఆగస్టు 6 న చేపట్టనున్న నిరుద్యోగ భరోసా యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సిటీ సెంట్రల్ లైబ్రరీలో విడుదల చేశారు. ఆగస్టు 6న నిరుద్యోగ భరోసా యాత్ర ఉస్మానియా యూనివర్సీటీ నుంచి ప్రారంభమై వనపర్తిలో ముగుస్తుందని, ఈయాత్రలో బాధిత కుటుంబాలను పరామర్శించి, భరోసాగా నిలబడతామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము, శంకర్ గౌడ్, రాకేష్, వెంకటేష్, చంద్రశేఖర్ రెడ్డి, గొల్ల రాజేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.