- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభుత్వ పథకాలతో సంబంధం లేదు.. పీ4 లక్ష్యం అదే: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: పీ4 విధానానికి, ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పీ4 విధానంపై అమరావతి సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ సంపన్నులను, పేదలను ఒకే చోటకు చేర్చడమే పీ4 విధానం లక్ష్యమని చెప్పారు. పీ4 విధానంలో ఎవరైనా భాగస్వాములు కావొచ్చని తెలిపారు. ఎన్నారైలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ విధానం అమలు ప్రక్రియలో అండగా ఉండేవారిని మార్గదర్శిగా, లబ్ధి కుటుంబాలను గోల్డెన్ ఫ్యామిలీలుగా వ్యవహరిస్తామని తెలిపారు. తొలుగు గ్రామ, వార్డులో పీ4 విధానాన్ని అమలు చేస్తామని, అక్కడి నిర్వహించిన సభల ద్వారా లబ్ధి కుటుంబాల లిస్టును తయారు చేస్తామని చెప్పారు. ఈ విధానం ద్వారా తొలి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. 2029 నాటి రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనేది ప్రభుత్వం సంకల్పమన్నారు. పేదరికం నిర్మూలన కోసం ఉగాది పండుగ రోజున ఈ పీ4 విధానాన్ని అమలు చేయబోతున్నామని, ఆ తర్వాత నిరంతరం కొనసాగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.