11 జిల్లాల్లో ఈ నెల 21 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

by Shamantha N |   ( Updated:2021-06-10 21:40:03.0  )
lock down
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడిలో భాగంగా కర్నాటకలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ఈనెల 21 వరకూ లాక్‌డౌన్ పొడిగించినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. చిక్‌మంగుళూర్, చామరాజనగర్, హసన్, దక్షిణ కన్నడ, బెంగళూర్ రూరల్, కొడుగు, బెల్గావి, దావణగెరె, శివమొగ్గ, మాండ్య జిల్లాలో ఈనెల 21వ తేదీ వరకు లాక్‌డౌన్ పూర్తి స్థాయిలో అమలులో ఉంటుందని ఆరోగ్యశాఖ మంత్రి కే. సుధాకర్ గురువారం తెలిపారు. బెంగుళూర్, మరి కొన్ని జిల్లాలో పాజిటివ్ కేసులు తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్ మార్గదర్శకాలను సడలించినట్టు పేర్కొన్నారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story