- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డీఎంహెచ్‌వో డా.సుజాతపై బదిలీ వేటు?
దిశ, కరీంనగర్ సిటీ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సుజాతపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తుంది. ఆమె స్థానంలో డిప్యూటీ డీఎంహెచ్ఓగా హుజురాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న డా. జువేరియాకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం కాగా, నేడు బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డా. సుజాత, ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులకు కూడా అందుబాటులో ఉండటం లేదని తేలింది. ఓ వైపు కరోనా ప్రభావం తీవ్రమవుతుండగా, ఆస్పత్రులపై కనీస పర్యవేక్షణ కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం కొంతమంది అధికారుల ఫోన్లు మాత్రమే ఎత్తుతూ, మిగతా వారిని పట్టించుకోవటం లేదంటూ పలువురు ఇప్పటికే ఫిర్యాదులు చేసినట్లు వైద్యశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. మంత్రి ఫోన్ చేసినా స్పందిచలేదనే విమర్శలున్నాయి. దీనిపై గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో కూడా మంత్రి గంగుల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో స్పందించిన కలెక్టర్ వెంటనే ఆమెను బదిలీ చేస్తూ డా. జువేరియాకు అదనపు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.