పోలీసులకు మూడు రోజుల టైం ఇస్తున్నాం : కపిల్ మిశ్రా

by Shamantha N |
పోలీసులకు మూడు రోజుల టైం ఇస్తున్నాం : కపిల్ మిశ్రా
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత కపిల్ మిశ్రా.. ఢిల్లీ పోలీసులకు అల్టీమేటం జారీ చేశారు. ఢిల్లీలోని జాఫ్రాబాద్, చాంద్‌బాగ్‌ రోడ్లపై పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులను మూడు రోజల్లో పంపించేయాలని అన్నారు. నిరసనకారులను రోడ్లపై నుంచి పంపించేందుకు పోలీసులకు మూడు రోజుల గడువు ఇస్తున్నాం.. ఖాళీ చేయించకుంటే తామే రోడ్లపైకి వస్తామని బెదిరించారు. అప్పుడు పోలీసులు మాట వినబోమని హెచ్చరించారు. ట్రంప్ పర్యటన ముగిసేవరకు తాము శాంతిగా ఉంటామని, అంతలోపే రోడ్లను ఖాళీ చేయించాలని అన్నారు. జాఫ్రాబాద్‌‌లో శనివారం రాత్రి నుంచి దాదాపు 500 మంది మహిళలు సీఏఏను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. జాఫ్రాబాద్‌కు సమీపంలోనే మౌజ్‌పూర్‌లో ఆదివారం రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇరుపక్షాలు పరస్పరం రాళ్లు విసురుకున్నాయి. ఆందోళనకారులను చెదిరివేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. అయితే, ఈ మౌజ్‌పూర్‌లోనే సీఏఏను సమర్థించుకుంటూ తీసిన ర్యాలీలో కపిల్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Read also..

కామారెడ్డి‌లో దారుణం..

Advertisement

Next Story