పేద‌ల‌ను ఆదుకోవ‌డం సామాజిక బాధ్య‌త‌..

by  |

దిశ‌, ఖ‌మ్మం : కరోనా దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈలాంటి ప‌రిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద‌ల‌ను ఆదుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాల‌ని ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ చైర్మన్ మేళ్లచెరువు వెంకటేశ్వరరావు అన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సుమారు 500 మంది నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కృష్ణ, స్థానిక కార్పొరేటర్ రమాదేవి, హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపుమేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పేద‌ల‌కు బియ్యం, కందిపప్పు, మంచినూనె, కారం చింతపండు, పసుపు, ఉల్లిగడ్డలు పంపిణీ చేసిన‌ట్టు తెలిపారు. ఇప్పటికే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రూ.55,116ల‌ను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందజేసినట్టు వెల్ల‌డించారు. మేయర్ పాపాలాల్‌ మాట్లాడుతూ.. పేదల ఆకలి తీర్చేందుకు కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ ముందుకు రావడం మంచి పరిణామమని అన్నారు.ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాని కోరారు.నిత్యావసరాలు తీసుకోవడానికి వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించాలన్నారు. ఈరోజు సరుకులు తీసుకోవడానికి వచ్చిన మ‌హిళ‌లు సామాజిక దూరం పాటించ‌క‌పోవ‌డంపై పలు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

Tags: carona, lockdown, 500 members, rice distribution, kanyaka parameshwari temple chairman

Advertisement

Next Story