తెలుగు నటుడికి కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్

by Anukaran |
తెలుగు నటుడికి కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ లెజెండరీ హీరో విష్ణువర్ధన్‌పై తెలుగు సీనియర్ నటుడు విజయ రంగరాజు చేసిన కామెంట్స్‌పై శాండల్‌వుడ్ ఫైర్ అవుతోంది. అలాంటి గొప్పనటుడిపై ఇంటర్వ్యూలో చీప్‌గా కామెంట్ చేయడంపై కన్నడ నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రెస్పెక్ట్ ఆర్ట్ అండ్ రెస్పెక్ట్ ఆర్టిస్ట్’ పేరుతో ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్న శాండల్‌వుడ్.. విజయ రంగరాజు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

‘ఈగ’ ద్వారా తెలుగులో గుర్తింపు పొందిన కిచ్చా సుదీప్ కూడా ఈ విషయంలో ఫైర్ అయ్యారు. విష్ణువర్ధన్ అభిమానిగా ఇలాంటి విషయాలను అసలు లైట్‌గా తీసుకోలేనన్నారు. ఒక వ్యక్తి బతికి ఉన్నప్పుడు మాట్లాడటం అనేది మగతనం అనిపించుకుంటుంది కానీ, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్యదైవమైన వ్యక్తి చనిపోయాక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఘోరతప్పిదమే అవుతుందన్నారు. మీ పరిశ్రమలోని వ్యక్తులను మేము గౌరవిస్తున్నప్పుడు మా ఇండస్ట్రీ ప్రముఖుని గురించి అవమానకరంగా మాట్లాడాన్ని మీ ఇండస్ట్రీలో ఎవరూ కూడా హర్షించరన్నారు.‘ అలా అన్నారు.. ఇలా అ న్నారు అంటూ నీ స్థాయి దిగజార్చుకోకు’ అని సూచించిన సుదీప్.. విష్ణు సార్‌ గురించి తప్పుగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదన్నారు. ఆయన కోట్లాది మంది అభిమానులను మిగిల్చి వెళ్లారని.. మీ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు సుదీప్.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ విషయంలో స్పందించారు. సీనియర్ మోస్ట్ యాక్టర్ డా. విష్ణువర్ధన్‌‌పై ఇలాంటి కామెంట్ చేసిన వ్యక్తి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. నటుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం.. కళను, కళాకారుడిని ప్రేమించడమని.. గొప్పనటుడిని అపఖ్యాతిపాలు చేయడం సహించలేమన్నారు. ఈ విషయంలో కన్నడ ఇండస్ట్రీ మొత్తం ఐక్యంగా ఉందన్నారు. మరి ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది? విజయ రంగరాజు తన మాటలను వెనక్కి తీసుకుంటారా? లేక కన్నడ స్టార్‌పై తను చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీనే వేటు వేస్తుందా? చూడాలి.

Advertisement

Next Story

Most Viewed