కనికా… నీ ప్రవర్తన సరికాదు

by Shyam |
కనికా… నీ ప్రవర్తన సరికాదు
X

బాలీవుడ్ సెలబ్రిటీల్లో తొలి కరోనా పాజిటివ్ నమోదైన విషయం తెల్సిందే. విదేశాల నుంచి తిరిగొచ్చిన సింగర్ కనికా కపూర్ Covid 19 బారిన పడినట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమెకు లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ అండ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఐతే కనికా ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు వినడం లేదని తెలుస్తుంది. ఒక రోగిలా కాకుండా స్టార్ లా బిహేవ్ చేస్తుందని మండిపడుతున్నారు వైద్యులు. చికిత్సలో భాగంగా కనికాకు హాస్పిటల్ కిచెన్ నుంచి ఫుడ్ అందిస్తున్నామని… ఐసొలేషన్ గదిలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నా… తను మాత్రం స్టార్ లా ఫీల్ అవుతుందని… డాక్టర్లు చెప్పినట్లు వినడం లేదని తెలిపారు. సిబ్బందికి సహకరిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

కాగా లండన్ నుంచి తిరిగొచ్చిన కనికా కపూర్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండకుండా పార్టీలకు హాజరైంది. ఆ పార్టీకి బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్, అనుప్రియ పటేల్ హాజరుకాగా… వీరంతా సెల్ఫ్ క్వారెంటెన్ కు వెళ్లిపోయారు.

Tags: Kanika Kapoor, Bollywood, Coronavirus, Covid 19

Advertisement

Next Story

Most Viewed