పేదల నుంచి అడుక్కోకండి.. స్టార్స్‌‌పై కంగన ఫైర్

by Shyam |
పేదల నుంచి అడుక్కోకండి.. స్టార్స్‌‌పై కంగన ఫైర్
X

దిశ, సినిమా : ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సెలబ్రిటీల తీరుపై మండిపడింది. కొవిడ్ ఫండ్ రైజింగ్ అంటూ సామాన్యుల నుంచి విరాళాలు సేకరిస్తున్న స్టార్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు రిచ్ అయితే సహాయం చేయండి.. అంతేకానీ పేదల నుంచి అడుక్కోవద్దని విమర్శించింది. హాస్పిటల్‌లో బెడ్స్, ఆక్సిజన్, మందులు సమకూర్చేందుకు మీ పాపులారిటీ ఉపయోగపడితే కొన్ని ప్రాణాలను కాపాడొచ్చన్న ఆమె.. జీవితంలో కొందరు నాటకాలు ఆడుతారు, కొందరు నిజంగానే హెల్ప్ చేస్తారు, మరి మీరు ఏ కేటగిరీనో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించింది.

Advertisement

Next Story