ప్రియాంక దేశద్రోహిగా ఉండాలనుకుంటున్నావా?: కంగనా

by Shyam |
ప్రియాంక దేశద్రోహిగా ఉండాలనుకుంటున్నావా?: కంగనా
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్..దిల్‌జిత్ సింగ్, ప్రియాంక చోప్రాపై మండిపడింది. పనికిరాని స్టేట్‌మెంట్లతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయింది. ఇస్లాంకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. భారత సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉండే ఇలాంటి వాళ్లనే కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆఫర్లతో ముంచెత్తుతున్నాయని..అలాంటి వాళ్లు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్ప దంగా ఉందంది కంగనా. అయినా ప్రాబ్లమ్ వాళ్లది కాదు 2020 ఫార్మర్స్ బిల్‌ను వ్యతిరేకిస్తున్న ప్రతీ ఒక్కరిదని అభిప్రాయపడింది.

ప్రియాంక, దిల్‌జిత్‌ అన్నదాతలను తప్పుదారి పట్టించి దేశద్రోహుల పుస్తకంలో చేరాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. నిజంగా రైతుల గురించి ఆందోళన చెందితే అసలు వ్యవసాయ బిల్లు అంటే ఏమిటో తెలుసుకోవాలని సలహా ఇచ్చింది. ఈ చట్టం వల్ల అన్నదాతలకు ఎలాంటి మేలు కలుగుతుందో విపక్షాలకు తెలిసినా సరే.. కేవలం వారి స్వార్థం కోసం రైతుల్లో హింస, ద్వేషం పెంచుతూ ఆందోళనకు దారి తీసేలా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

https://twitter.com/KanganaTeam/status/1337230078669774849?s=20

Advertisement

Next Story

Most Viewed