నొప్పి తర్వాతే కీర్తి దక్కుతుంది : కంగనా

by Jakkula Samataha |
నొప్పి తర్వాతే కీర్తి దక్కుతుంది : కంగనా
X

దిశ, వెబ్‌డెస్క్ : కంగనా రనౌత్ చాలా కష్టపడి ఎదిగింది. కెరియర్ తొలినాళ్లలో తనను హీరోయిన్‌గా పనికిరావని అన్నా సరే, నిరాశ చెందకుండా పట్టుదలతో ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆఫర్లు దక్కించుకుని, బాలీవుడ్ క్వీన్‌గా ఎదిగింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న తర్వాత.. తనను పనికిరాదన్న వారితో పాటు అవకాశం ఇచ్చినా తనను కనీసం మనిషిలాగా కూడా చూడని బాలీవుడ్ పెద్దలను ఓపెన్‌గానే ప్రశ్నించింది. తాను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో, తప్పు చేస్తే ఎంత గొప్ప వ్యక్తినైనా ప్రశ్నించడంలో వెనకడుగు వేయని తత్వం కంగనాది.

కాగా, ఇదే తత్వం తన టాటూలోనూ జోడించి వర్ణించింది కంగనా. సోషల్ మీడియా లేటెస్ట్ పోస్ట్‌లో తన మెడపై ఉన్న టాటూ పిక్ షేర్ చేసిన కంగనా.. ముందుగా రెక్కలు పచ్చబొట్టుగా వేయించానని తెలిపింది. కానీ అది ఎందుకు వేయించిందీ అర్థం కాక.. అదే పచ్చబొట్టుకు కిరీటం జోడించినట్లు చెప్పింది. అయినా కూడా దానికి పర్ఫెక్ట్ మీనింగ్ రాకపోయే సరికి.. లేటెస్ట్‌గా ఆ టాటూకి తల్వార్ జత చేసినట్లు తెలిపింది. ఇప్పుడు ఈ టాటూకి జీవం ఉన్నట్లు కనిపిస్తోందని.. జీవితంలో కూడా అంతే, నొప్పి తర్వాతే కీర్తి ప్రతిష్టలు వస్తాయని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story