- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తాప్సీకి కంగనా కౌంటర్ : దోషివి కాకపోతే.. కోర్టుకు వెళ్లు చూద్దాం!
దిశ, సినిమా : నటి తాప్సీ పన్ను ఐటీ రైడ్స్‌పై స్పందించింది. దాదాపు మూడు రోజులు కామ్‌గా ఉన్న తాప్సీ.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసింది. ప్రధానంగా మూడురోజులుగా మూడు విషయాలపై శోధన చేశానన్న తాప్సీ.. ‘1. పారిస్‌లో నాకు బంగ్లా ఉందని ఆరోపించారుగా! ఆ తాళం గురించి సెర్చ్ చేస్తున్నా. ఎందుకంటే వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి కదా. 2. భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుందనే ఆశతో గతంలో తిరస్కరించిన రూ.5 కోట్ల రిసీట్ కోసం వెతికాను. 3. గౌరవనీయ ఆర్థికమంత్రి చెప్పిన 2013 దాడి జ్ఞాపకాలను కూడా శోధించా’ అని ట్వీట్ చేసింది. ‘నాకు అంత స్థోమత లేదు’ అని లాస్ట్‌లో క్లారిటీ ఇచ్చింది. కాగా నిర్మలా సీతారామన్ ఐటీ దాడుల గురించి మాట్లాడుతూ 2013లో ఎవరైతే సెలబ్రిటీలపై దాడులు జరిగాయో ఇప్పుడు కూడా వారిపైనే ఐటీ రైడ్స్ జరిగాయని తెలిపారు.
ఇక ఈ మధ్య బీజేపీపై ఒక్క మాట కూడా పడనివ్వకుండా చూసుకుంటున్న కంగన.. తాప్సీ ట్వీట్‌పై స్పందించింది. ‘నీకు ఎప్పటికీ ఆ స్థోమత ఉంటుంది. ఎందుకంటే నువ్వు రేపిస్టుల ఫెమినిస్ట్. నీ రింగ్ మాస్టర్ అనురాగ్ కశ్యప్‌పై టాక్స్ చోరీ కేసులో 2013లో దాడులు జరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల నివేదిక ముగిసింది, మీరు దోషులు అనుకోకపోతే దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లి క్లీన్ చీట్‌తో వచ్చేయండి’ అని రిప్లై ఇచ్చింది.
https://twitter.com/KanganaTeam/status/1368077210628800512?s=20