‘కళ్యాణమస్తు’కు ముహుర్తాలు ఖరారు..

by srinivas |   ( Updated:2021-02-17 06:35:40.0  )
‘కళ్యాణమస్తు’కు ముహుర్తాలు ఖరారు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా పున:ప్రారంభించనున్న కళ్యాణమస్తు(సామూహిక వివాహాల) కోసం పండిత మండలి 3 ముహూర్తాలను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే బుధవారం టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డికి లగ్న పత్రిక అందజేసింది. తిరుమల నాద నీరాజనం వేదిక మీద ఇవాళ శ్రీ గోపావజ్జల బాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, శ్రీ అర్చకం వేణుగోపాల దీక్షితులు, శ్రీ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులతో కూడిన పండిత మండలి సమావేశమై శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కళ్యాణమస్తు నిర్వహణకు దివ్యమైన ముహూర్తాలను పరిశీలించింది.

వైశాఖ బహుళ విదియ శుక్రవారం మూల నక్షత్రం సింహలగ్నం తేదీ : 28-5-2021, మధ్యాహ్నం 12-34 నుంచి 12- 40 నిముషాల మధ్య ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు. అలాగే. ఆశ్వయుజ బహుళ పక్ష తత్యాల దశమి శనివారం మఖ నక్షత్రం ధనుర్లగ్నం తేదీ : 30-10-2021 ఉదయం 11-04 నుంచి 11-08 గంటల మధ్య రెండో ముహూర్తం.. కార్తీక మాసం శుక్లపక్ష తత్యాల చతుర్దశి బుధవారం అశ్విని నక్షత్రం ధనర్లగ్నం తేదీ : 17- 11- 2021ఉదయం 9-56 నుంచి 10-02 గంటల మధ్య మూడో ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ మూడు ముహూర్తాలతో కూడిన లగ్న పత్రికను టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డికి అందించారు. కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ ఎ. వి. ధర్మారెడ్డి, హిందూధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్ర నాథ్, విజిఓ శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed