ఎమ్మెల్సీ కవిత బర్త్‌డే… టీఆర్ఎస్ నేత 60 అడుగుల గిఫ్ట్

by Anukaran |   ( Updated:2023-12-13 11:24:19.0  )
ఎమ్మెల్సీ కవిత బర్త్‌డే… టీఆర్ఎస్ నేత 60 అడుగుల గిఫ్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత పుట్టినరోజు. ఆమె జన్మదినం సందర్భంగా.. కవితకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నేత.. కవితకు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు శైలేష్ కులకర్ణితో.. రవీంద్రభారతిలో నేలపై 60 అడుగుల భారీ చిత్రపటాన్ని వేయించారు. ఈ కళాఖండం కోసం లక్ష రూపాయల ఖర్చు చేసినట్టు సమాచారం. కవిత చిత్రపటం రూపొందించడానికి కళాకారులు దాదాపు 20 గంటలకు పైగా శ్రమించారు. రవీంద్రభారతి బయట వేసిన ఈ చిత్రం వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు పోటీపడుతున్నారు.

Advertisement

Next Story