- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా ఫ్యామిలీ మొత్తం నాశనమవుతుంది.. కాకాని సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఆనందయ్య మందు రాజకీయంగా దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆనందయ్య మందుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇక నెల్లూరు రాజకీయాల్లో ఇవి మరింత హీటెక్కిస్తున్నాయి. ఆనందయ్య మందు పంపిణీపై నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య గత కొద్దిరోజులుగా మాటలతూటాలు పేలుతున్నాయి.
ఆనందయ్య మందును అడ్డుగా పెట్టుకుని కాకాని బిజినెస్ చేస్తున్నారని, ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి ఏర్పాటు చేసిన చిల్‌డిల్.ఇన్ వెబ్ సైట్ కాకాణికి చెందిన శిశ్రిత టెక్నాలజీ నిర్వహణలో ఉందని ఆరోపించారు. ఫ్రీగా లభించే మందుకు డబ్బులు పెట్టి వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తుందని, దీని వెనుక కోట్ల రూపాయాల స్కామ్ జరుగుతుందని సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
సోమిరెడ్డి ఆరోపణలకు తాజాగా కాకాని కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే నడిరోడ్డులో ఉరేసుకుని చనిపోతానన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జిలో విచారణకు కూడా తాను సిద్ధమన్నారు. ఆనందయ్య మందుని అడ్డుగా పెట్టుకుని వ్యాపారం చేయాల్సిన అవసరం తనకు లేదని, తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ విషయం చెబుతున్నానన్నారు ఆనందయ్య మందుపై వ్యాపారం చేయాలనే ఆలోచన కూడా తనకు లేదన్నారు. ఒకవేళ ఆ ఆలోచన తనకు వచ్చినా.. తమ ఫ్యామిలీ మొత్తం నాశనం అవ్వుతుందని కాకాని తనకు తానే శాపనార్థాలు పెట్టుకున్నారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా తాను ఈ మాటలు చెబుతున్నానన్నారు.