షారుఖ్ ప్రాణాలు కాపాడిన కాజోల్.. రుణం తీర్చుకోలేనన్న బాద్‌షా

by Shyam |
sharukh-khan
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ ఆన్‌స్క్రీన్ జోడీ షారుఖ్- కాజోల్‌ జంటగా 2015లో విడుదలైన యాక్షన్ లవ్ స్టోరీ ‘దిల్‌వాలే’. ఈ మూవీ నేటితో 6 వసంతాలు పూర్తిచేసుకోగా.. ఇందులోని సన్నివేశాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను కాజోల్ గుర్తుచేసుకుంది. ఈ సినిమాలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘గేరువా’ సాంగ్ షూటింగ్‌లో షారుఖ్ ప్రాణాలను కాపాడినట్లు తెలిపింది. ‘విదేశాల్లోని అందమైన లొకేషన్లలో ఈ పాట చిత్రీకరణ ప్లాన్ చేయగా.. ఓ గుహలోని జలపాతం సమీపంలో రిహార్సల్స్ చేస్తున్నాం. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు షారుఖ్ కొండపై నుంచి పడిపోతుండగా వెంటనే నేను అతని చేయిపట్టి పైకి లాగాను. అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు’ అని చెప్పింది.

ఇక ఈ పాట చిత్రీకరణకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, మంచుకొండల్లో చలికి తట్టుకోలేక షారుఖ్, తాను ప్లాస్టిక్ పరదా కింద తల దాచుకున్నామని తెలిపింది. కాగా ఈ వీడియోపై షారుఖ్ స్పందిస్తూ.. ‘దిల్‌వాలే సాంగ్ మేకింగ్ సమయంలో కాజోల్ నా ప్రాణాలు కాపాడింది. నిజం చెప్పాలంటే ఈ జీవితం తనదే. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అని అంగీకరించాడు. ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించగా.. వరుణ్ ధావన్, కృతి సనన్ కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Next Story