- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై పోరాడాలా.. ఫీజులపై పోరాడాలా ?
దిశ, న్యూస్‌బ్యూరో :
తాము కరోనాపై పోరాడాలా.. లేక ఫీజులపై పోరాటాలు నిర్వహించాలా అంటూ జూనియర్ డాక్టర్లు రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీశారు. మెడికల్ పీజీలో గరిష్టంగా 1,141 శాతం ఫీజులను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జుడాలు డిమాండ్ చేశారు. ఫీజుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం కోఠి మెడికల్ కాలేజీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుకూలంగా ఉండేవిధంగా కౌన్సెలింగ్ మధ్యలో ఫీజులను పెంచారని జుడాలు ఆరోపించారు. 2017లో పెంచిన ఫీజుల పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నాయని, ఆ కేసులో తీర్పు రాకముందే ఫీజులు ఎలా పెంచుతారని వారు ప్రశ్నించారు. వెంటనే జీఓ 20ని రద్దు చేయాలని జుడాలు డిమాండ్ చేశారు.
పీజీ కోర్సుల ఫీజు పెంపు చేస్తూ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఈ ఏడాది ఏప్రిల్ 14న జీఓ 20ని విడుదల చేసింది. 2016లోని జీఓ29తో పోలిస్తే తాజా జీఓలో కేటగిరిని బట్టి 142 నుంచి 1,141 శాతం ఫీజుల పెంపు చేశారు. కన్వీనర్ కోటాలో క్లినికల్ కోర్సులకు గతంలో ఉన్న రూ.3.20 లక్షల ఫీజును రూ.7.75 లక్షలు, పారా మెడికల్ కోర్సులకు రూ.88 వేలను రూ.4.32 లక్షలకు పెంచుతున్నట్టు జీఓలో పేర్కొన్నారు. ఇక మేనేజ్‌మెంట్ కోర్సులకు సంబంధించిన క్లినికల్ కోర్సులకు రూ.5.80 లక్షల ఫీజును రూ.23 లక్షలకు పెంచగా, ఎఆర్ఐ కోటా సీట్లను రూ.5.80 లక్షల నుంచి రూ.73 లక్షలు (1,141%) పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Tags: lockdown, corona, KCR, Health, Telangana, JuDa, Koti medical college