- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జూనియర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్ కింబర్లీకి కరోనా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కొడుకు గర్ల్‌ఫ్రెండ్ కింబర్లీ గుయిల్‌ఫోల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఫాక్స్ న్యూస్‌లో పనిచేసని కింబర్లీ ఈ నెలలో అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగానికోసం దక్షిణ డకోటాకు ప్రయాణమైంది. మౌంట్ రష్‌మోర్ దగ్గర కొన్ని వేడుకల్లో పాల్గొంది. అధ్యక్షుడి చెంతకు వచ్చినట్టు భావించే ప్రతి ఒక్కరికి నిర్వహించే కరోనా టెస్టుల్లో భాగంగా కింబర్లీని పరీక్షించగా ఆమెకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ట్రంప్ ప్రచార కమిటీ ఫైనాన్స్ విభాగం స్టాఫ్ చీఫ్ సెర్జియో గోర్ స్పందిస్తూ, కింబర్లీ ఆరోగ్యంగానే ఉన్నదని, కరోనా లక్షణాలేవీ లేవని, మరోసారి టెస్టు నిర్వహిస్తామని అభిప్రాయపడ్డారు. అయితే, ముందు జాగ్రత్తగా ఆమె కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నామని, జూనియర్ ట్రంప్‌కు కరోనా నెగెటివ్ వచ్చిందని, అయినప్పటికీ స్వీయ నిర్బంధంలోకి పంపించారని తెలిపారు. యూఎస్ ప్రెసిడెంట్‌కు సన్నిహితంగా మెలుగుతున్నవారిలో ఈమె కరోనా సోకిన మూడో వ్యక్తి. ఇదివరకు ట్రంప్ పర్సనల్ వ్యాలెట్, ఉపాధ్యక్షుడి ప్రెస్ సెక్రెటరీకి కరోనా సోకిన విషయం తెలిసిందే.