- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు రూ.20లక్షల బీమా కల్పించాలి: అల్లం నారాయణ
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులకు రూ.20లక్షల ప్రమాద బీమా కల్పించాలని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం బీఆర్కే భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్‌లో అత్యవసర సర్వీసులైన వైద్యం, పారిశుద్ధ్యం, పోలీసులతో సమానంగా జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వహిస్తున్నారని తెలిపారు. జర్నలిస్టులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోందని, టీవీ5 రిపోర్టర్ మనోజ్ కుమార్ విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడి చనిపోవడం బాధాకరమన్నారు. ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం కరోనా కిట్ సరఫరా చేయాలని ఆయన కోరారు. జర్నలిస్టులకు వైద్య పరీక్షలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రి ఈటలను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ , సయ్యద్ ఇస్మాయిల్, యూసుఫ్ బాబు, నవీన్ కుమార్, సాధిక్, పార్థసారథి పాల్గొన్నారు.