- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జర్నలిస్టు మృతికి కారణం చైనాయే?
దిశ, వెబ్ డెస్క్: నేపాల్ దేశంలో చైనా దురాక్రమణలను వెలుగులోకి తీసుకొచ్చిన ఆ దేశ జర్నలిస్టు బలరామ్ బనియ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతన్ని మృతదేహాన్ని శుక్రవారం నేపాలీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాగమతి నది పరీవాహక ప్రాంతంలోని మండు సమీపం వద్దనున్న జల విద్యుత్తు కేంద్రం దగ్గర బనియ మృతదేహం కనిపించిందని వెల్లడించారు.
మక్వాన్‌పూర్ జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. బలరామ్ కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జర్నలిస్టు మృతదేహాన్ని గుర్తించి, హెటౌడా హాస్పిటల్‌కు తరలించారు. బల్ఖు నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఆయన చివరిసారి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. అతని మొబైల్ లొకేషన్ కూడా చివరిసారి ఇదే ప్రదేశాన్ని చూపించిందని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ అయింది.
బలరామ్ బనియ ‘కాంతిపూర్ డైలీ’ అనే నేపాలీ పత్రికలో పని చేస్తున్నారు. మొదట రాజకీయాలు, పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాసే ఆయన తర్వాత పరిపాలన, బ్యూరోక్రసీలకు సంబంధించిన వార్తలు రాసేవారు. ఆయన చనిపోక ముందు గూర్ఖా జిల్లాలోని రుయి గ్రామంలో చైనా ఆక్రమణల గురించి ఓ వ్యాసం రాశారు. ఆ తర్వాత అనుమానాస్పదంగా మృతిచెందడంతో ఈ పని చైనానే చేసిందని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.