- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేసుకున్న పాపం.. కరోనా రోగం: జోగిని
దిశ, వెబ్‌డెస్క్: చేసుకున్న పాపం, తప్పుల ద్వారానే ఈ మాయ రోగాలు వస్తున్నాయని జోగిని శ్యామల భవిష్యవాణిలో వినిపించారు. కరోనా మహమ్మారి అంతం కావాలంటే ఊరి పొలిమెరలో ఉన్న శక్తులను శాంతిపజేయాలని చెప్పారు. ఆషాడ మాసాన లష్కర్ బోనాలు హైదరాబాద్‌లో తొలి సారిగా నిరాడంబరంగా సాగుతున్నాయి. భక్తికి ఎటువంటి కొదువ లేకుండ ప్రజలు అమ్మవార్లకు బోనాలు ఇంటివద్దనే సమర్పించుకున్నారు. అయితే, నగరంలో బోనాల ఉత్సవాల్లో భాగంగా రంగం కార్యక్రమం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అమ్మవారు ప్రతియేటా ఓ మహిళ రూపంలో వచ్చి భవిష్యవాణి వినిపిస్తారని భక్తుల నమ్మకం.
హైదరాబాద్ ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని మహాంకాళి, లాల్ దర్వాజ ఆలయంలో రంగం కార్యక్రమం ఎంతో కీలకమైనది. గత వారం ఉజ్జయిని అమ్మవారి సాక్షిగా భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.. చేసుకున్న దానికి అనుభవించక తప్పదు అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, నేడు లాల్ దర్వాజ వద్ద భవిష్యవాణి వినిపించిన జోగిని.. చేసుకున్న పాపాలతోనే ఈ మాయ రోగాలు వస్తున్నాయని చెప్పారు. కరోనా రోగం పోవాలంటే గ్రామ పొలిమెరల్లో ఉన్న శక్తులను శాంతిపజేయాలని సూచించారు. అప్పుడే ఈ రోగాలను రాకుండా చూస్తానని భవిష్యవాణిలో వినిపించారు.