‘బైడెన్ బలహీన అధ్యక్షుడు.. యుద్ధాలు జరగొచ్చు’

by Anukaran |   ( Updated:2020-11-23 09:17:15.0  )
‘బైడెన్ బలహీన అధ్యక్షుడు.. యుద్ధాలు జరగొచ్చు’
X

బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటాడన్న భ్రమలు వదలాలని జిన్ పింగ్ ప్రభుత్వ సలహాదారుడు జెంగ్ యోంగ్‌నిన్ హెచ్చరించారు. కటువైన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి చైనా సిద్ధపడాలని సూచించారు. మంచి రోజులు ముగిసిపోయాయని, ప్రచ్ఛన్న యుద్ధపు గద్దలు రాత్రికి రాత్రే మాయమైపోవని నర్మగర్భంగా మాట్లాడారు. అమెరికా సమాజం ఛిన్నాభిన్నమై ఉన్నదని, బైడెన్ దీన్ని పరిష్కరిస్తాడన్న గ్యారంటీ లేదని అన్నారు.

బైడెన్ బలహీనమైన అధ్యక్షుడని, దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరిస్తాడన్న నమ్మకం తనకు లేదని వివరించారు. చైనాపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సందర్భంలో వైట్‌హౌజ్‌లో అడుగుపెడుతున్న బైడెన్ అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి యుద్ధాలను ఆశ్రయించే ముప్పు ఉన్నదని తెలిపారు. దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకుంటూ చైనాపై యుద్ధానికీ దిగొచ్చని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛపై ట్రంప్‌కు అభిమానం లేకపోవచ్చునని, కానీ, యుద్ధాలపై మాత్రం ఇష్టం లేదని అన్నారు. కానీ, జో బైడెన్ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛపట్ల మక్కువ ఉన్నప్పటికీ యుద్ధాలనూ ప్రారంభించే అవకాశమున్నదని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed