- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జో బైడెన్ రాజకీయ ప్రస్థానం ఇదే..
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించారు. సెనేటర్‌గా రాజకీయ ప్రస్థానాన్నిప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి అమెరికా అధ్యక్షునిగా ఆయన ఎన్నికైన తీరు అద్భుతం. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి అగ్ర రాజ్యానికి అధినేతగా ఎదిగిన జోబైడెన్ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం..
పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్ కుటుంబంలో 1942లో జో బైడెన్ జన్మించారు. జో బెడెన్ అసలు పేరు జో రాబినేట్ బైడెన్ జూనియర్. మొదట యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్, సిరక్యూస్ యూనివర్సిటీ ఆఫ్ లా లో తన ఉన్నత విద్యాభాసాన్ని జోబెడెన్ పూర్తి చేశారు. ఆ తర్వాత రాజకీయం వైపు ఆయన మొగ్గు చూపారు. మొదటి సారిగా 1972లో డెలావర్ రాష్ట్రం నుంచి ఆయన సెనేటర్ గా ఎన్నికయ్యారు. మొత్తం ఆయన ఆరుసార్లు సెనేటర్‌గా పని చేశారు. ఆ తర్వాత 1988, 2008లో రెండు సార్లు అధ్యక్ష పదవి కోసం ఆయన ప్రయత్నించారు. ఒబామా హయాంలో రెండు సార్లు అమెరికా ఉపాధ్యక్షునిగా పనిచేశారు. స్వంత పార్టీలో ఆయనకు అనుకున్నంత మద్దతు లభించక పోవడంతో ఆయన తన లక్ష్యాన్ని సాధించలేకపోయారు. కానీ మూడో సారి ప్రయత్నంలో ఆయన విజసాధించడంతో అమెరికా అధ్యక్షుడు కావాలన్న ఆయన కల నెరవేరింది.