జపనీస్ ఒలింపిక్ కమిటీ అధికారి ఆత్మహత్య

by Shiva |
జపనీస్ ఒలింపిక్ కమిటీ అధికారి ఆత్మహత్య
X

దిశ, స్పోర్ట్స్: జపనీస్ ఒలింపిక్ కమిటీ (జేవోసీ)లో పని చేస్తున్న సీనియర్ అధికారి యసుషీ మోరియ (52) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆయన రైలు కింద పడి ఈ అఘత్యానికి పాల్పడినట్లు టోక్యో పోలీసులు తెలిపారు. ఒలింపిక్స్‌కు చెందిన డేటా బ్రీచ్ వెలుగులోకి వచ్చిన తర్వాత పలువురు జేవోయే అధికారులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. వారిపై నిఘా పెరిగిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్ అధికారి ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది.

టోక్యో మెట్రొపాలిటన్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టోక్యోలోని నకనోబు స్టేషన్ వద్ద పడి ఉన్న వ్యక్తిని గుర్తించి స్థానికులు సమాచారం అందించగా.. అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి,

Advertisement

Next Story

Most Viewed