టీచర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్.. పోస్టులు ఎన్నంటే !

by Harish |
టీచర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్.. పోస్టులు ఎన్నంటే !
X

దిశ, కెరీర్: తెలంగాణలో ఇటీవల వరుస నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చినా, నోటిఫికేషన్ విడుదల కాని వాటిలో 11 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే అనుమతి లభించినప్పటికీ నోటిఫికేషన్లు వెలువడలేదు. ఈ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీనిలో భాగంగానే రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పోస్టుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 11 వేల టీచర్ పోస్టులను సీఎం కేసీఆర్ ఎప్పుడో మంజూరు చేశారని ఆమె అన్నారు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.

ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా కొంతమంది కోర్టుకెళ్లి స్టే తెచ్చారని గుర్తుచేశారు. దీంతో హైకోర్టు మార్చి 16 వరకు ఎలాంటి టీచర్ల బదిలీ ప్రక్రియ చేపట్టవద్దని సూచించిందని అన్నారు. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసి 11 వేలకు పైగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె తెలిపారు.

Advertisement

Next Story