- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రీ ట్రైనింగ్.. హాస్టల్.. భోజన వసతితోపాటు ఉద్యోగం
దిశ, కెరీర్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఏపీ/తెలంగాణ నిరుద్యోగ యువతులకు ఉచిత ఉపాధి శిక్షణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతి ఉంటుంది. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. ఈ ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు అర్హత, ఆసక్తి ఉన్న గ్రామీణ/పట్టణ ప్రాంత యువతులు దరఖాస్తు చేసుకోవచ్చు.
శిక్షణ కార్యక్రమాలు: టైలరింగ్; ఎంబ్రాయిడరీ, జర్దోజి, క్విల్డ్ బ్యాగ్స్ మేకింగ్
వ్యవధి: 6 నెలలు
అర్హత : 8వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
నోట్ : చదువు మధ్యలో ఉన్న వారు అనర్హులు.
కావలసిన పత్రాలు:
అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ సెట్.
పాస్ పోర్ట్‌సైజ్ ఫొటోలు
ఆధార్ కార్డు
ఇన్‌కమ్ సర్టిఫికెట్
అడ్రస్: స్వామి రామానంద తీర్ధ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్ (గ్రా.), పోచంపల్లి (మం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణా - 508284.
హాజరు కావలసిన తేదీ: మే 8, 2023 (సోమవారం), ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావాలి.
వివరాలకు ఫోన్: 9133908000, 9133908111, 9133908222. 9948466111.