కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇండియాకు గోల్డ్

by Shyam |
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇండియాకు గోల్డ్
X

దిశ, స్పోర్ట్స్: భారత వెయిట్ లిఫ్టింగ్ సంచలనం జెరేమీ లాల్‌రినుగా ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ 2021లో స్వర్ణ పతకం సాధించాడు. తాష్కెంట్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో 67 కేజీల విభాగంలో అతడు మొత్తం 305 కేజీలు ఎత్తి పతకం సాధించాడు. జెరేమీ స్నాచ్‌లో 141 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 164 కేజీలు ఎత్తాడు. స్నాచ్‌లో 141 కేజీలు ఎత్తి సరికొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. అంతకు ముందు 2019లో జెరేమీ మొత్తం 306 కేజీలు ఎత్తాడు. అయితే అప్పట్లో స్నాచ్‌లో కేవలం 140 కేజీలే ఎత్తగా.. తాజాగా తాష్కెంట్‌లో 141 కేజీలతో జాతీయ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇక నైజీరియాకు చెందిన జోసెఫ్ ఎడిడియాంగ్ 295 కేజీలు ఎత్తి రజత పతకం, శ్రీలంకకు చెందిన మనోజ్ వహిసింఘే 254 కేజీలు ఎత్తి కాంస్య పతకం సాధించాడు. ఇక 73 కేజీల విభాగంలో అచింత శౌలి మొత్తం 316 కేజీలు ఎత్తి స్వర్ణ పతకం సాధించాడు. స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 173 కేజీల బరువు ఎత్తాడు. అంతే కాకుండా 2022 కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించాడు.

Advertisement

Next Story