మాజీ ప్రియుడితో మళ్లీ మొదలెట్టిన జెన్నీఫర్ లోపెజ్

by Shyam |   ( Updated:2021-05-16 01:49:52.0  )
మాజీ ప్రియుడితో మళ్లీ మొదలెట్టిన జెన్నీఫర్ లోపెజ్
X

దిశ, సినిమా : నాలుగు సంవత్సరాల డేటింగ్ తర్వాత పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్, ఫార్మర్ ఫుట్ బాల్ ప్లేయర్ అలెక్స్ రోడ్రిగ్ తమ రిలేషన్‌షిప్‌కు గుడ్‌బై చెప్పారు. మార్చి 2019లో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కాగా, పలు కారణాల వల్ల మ్యారేజ్‌ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఇక ఇన్నేళ్ల రిలేషన్‌షిప్‌లో ఇన్‌స్టా వేదికగా ఎన్నో స్వీట్ మెమొరీస్ పంచుకున్న ఈ జంట.. ప్రొఫెషన్స్‌కు సంబంధించి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడమే కాకుండా వీరి ఫ్యామిలీస్ కూడా కలిసిపోయాయి. అయితే కొంతకాలంగా వీరి రిలేషన్‌పై రూమర్స్ స్ప్రెడ్ అవుతుండగా.. ఖండిస్తూ వచ్చారు. కానీ జెన్నీఫర్.. తన మాజీ ప్రియుడు, యాక్టర్ బెన్ అఫ్లెక్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు కొన్ని వారాలుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ‘బెన్నిఫర్’గా పాపులర్ అయిన ఈ కపుల్‌కు 2002లో ఎంగేజ్‌మెంట్ కాగా, ఆ తర్వాత విడిపోయారు. కాగా రోడ్రిగ్‌తో బ్రేకప్ న్యూస్ హల్ చల్ చేస్తున్నప్పటి నుంచి జెన్నీఫర్ తన మాజీ ప్రియుడితో హ్యాంగవుట్ అవుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం రోడ్రిగ్‌- జెన్నీఫర్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయానని, అఫ్లెక్‌తో జెన్నీ రీయూనియన్ కావడమే అందుకు కారణమని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే రోడ్రిగ్ విడిపోయిన తర్వాత కూడా లోపేజ్‌తో ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేయాలనుకున్నా.. తను మాత్రం దూరం పెట్టిందని తెలిపాడు. నిజానికి రోడ్రిగ్‌పై తనకు నమ్మకం లేదని, అందుకే టైమ్ వేస్ట్ చేయదలుచుకోలేదని పేర్కొన్నాడు.

Advertisement

Next Story