- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి.. మోడీ పాలనకు వ్యతిరేకంగా బిలియన్ మార్చ్ చేయాలి : జీవన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ అంటేనే బడా జూట పార్టీ అని, జన కంటక పార్టీ అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ దేశాన్ని హోల్‌సేల్‌గా అమ్మాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మేందుకు బీజేప ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని, అవగాహన లేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
క్రీడా రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తే రెండు కోట్లు, కాంస్యం 50 లక్షలు, రజతం 10 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. ప్రతీ నియోజకవర్గంలో అవుట్‌డోర్ స్టేడియం నిర్మించి.. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని వెల్లడించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2020 ఏప్రిల్ 19న సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని అన్నారు. ఎవరెస్ట్ ఎక్కిన వారికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ విశ్వ నగరం గా ఉందని తెలిపారు.
బీఏసీలో సభ్యుడు కానందు వల్లే రఘునందన్‌ను సమావేశానికి పిలవలేదని తెలిపారు. బండి సంజయ్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మిలియన్ మార్చ్ నిర్వహించడం కాదని.. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు నిర్వహించాలని సూచించారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా బిలియన్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ.. విస్మరించారని ఆరోపించారు.