జైలు నుంచి అనంతపురానికి జేసీ

by Anukaran |
జైలు నుంచి అనంతపురానికి జేసీ
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కడపలోని సెంట్రల్ జైలు నుంచి ప్రభాకర్ రెడ్డిని అనంతపురంకు తాడిపత్రి పోలీసులు తీసుకెళ్లారు.

పోలీసులపై అసభ్యంగా వ్యవహరించిన కేసులో జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ప్రభాకర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆయనను తాడిపత్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలవరకు జేసీని విచారించనున్నారు.

Advertisement

Next Story