చిత్తూరులో దారుణం.. స్వగ్రామానికి వచ్చిన భారత జవాన్ మృతి

by srinivas |
army
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సెలవుపై స్వగ్రామానికి వచ్చిన భారత జవాన్ ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటన జిల్లాలోని పూతలపట్టు మండలం రంగంపేటలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మనోజ్ కుమార్ ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తు్న్నాడు. ఇటీవలే అతనికి పెళ్లి నిశ్చయం అవ్వగా సెలవుపై వచ్చి వివాహం చేసుకున్నాడు.

మూడు నెలల సెలవు గడువు ముగియడంతో తీరా విధులకు వెళ్దామనుకునే‌లోపు కారు ఢీకొనడంతో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో మనోజ్ కుమార్ పూతలపట్టు నుంచి రంగంపేటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జవాన్ మరణంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story