టీమిండియా ఓటమి.. అసలు నిజాలను బట్టబయలు చేసిన బుమ్రా

by Shyam |
టీమిండియా ఓటమి.. అసలు నిజాలను బట్టబయలు చేసిన బుమ్రా
X

దిశ, వెబ్‌డెస్క్: తీరిక లేని షెడ్యూల్.. బయోబబుల్స్‌ ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని, దాని ఫలితమే ఈ ఘోర పరాజయాలని టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ చేతిలో చిత్తయింది. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. ఈ వరుస ఓటములతో అటు ఆటగాళ్లు, ఇటు మేనేజ్‌మెంట్‌పై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమి కంటే భారత్ ఆడిన తీరును చూసి ఆవేదన చెందుతున్నారు.

మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కుటుంబాలకు దూరంగా బయోబబుల్స్‌లో ఉండటం వల్ల ఆ ప్రభావం ఆటగాళ్లపై పడుతోందన్నాడు. ఆటగాళ్లకు కొన్నిసార్లు విశ్రాంతి అవసరం. కుటుంబానికి దూరంగా ఉంటారు. ఆరు నెలలుగా విరామం లేకుండా ఆడుతున్నాం. బయోబబుల్‌లో ఉండటం వల్ల ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం పడుతోంది. మేము కంఫర్ట్‌గా ఉండేందుకు బీసీసీఐ సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తోంది. ఇది చాలా కష్టసమయం. మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. అందువల్ల ఈ బబుల్‌కు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నాం. మానసిక అలసట కూడా వేధిస్తోంది.’అని బుమ్రా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఐపీఎల్ కోసం యూఏఈకి చేరిన భారత ఆటగాళ్లు.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమయ్యారు. అయితే బుమ్రా వ్యాఖ్యల నేపథ్యంలో అభిమానులు బీసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed