- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పైలెట్‌లెస్ ప్లేన్ రూపొందిస్తోన్న జపాన్
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల డ్రైవర్‌లెస్ మెట్రో ట్రైన్‌ను ఢిల్లీ మెట్రో రూపొందించగా, తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే మాదిరి జపాన్‌లో పైలెట్‌లెస్ ఫైటర్ ప్లేన్‌ను రూపొందిస్తున్నారు. అయితే ఈ ప్లేన్‌ను జపాన్ మిలిటరీ విభాగం దేశ రక్షణ అవసరాల నిమిత్తం తయారుచేస్తోంది. యుద్ధక్షేత్రంలో శత్రువులను ఎదుర్కొనేందుకు ఈ రిమోట్ కంట్రోల్డ్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ అవసరమని, 2035 వరకు ఇది అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేసినట్లు మిలిటరీ ఆఫీసర్లు వెల్లడించారు. రిమోట్ బేస్డ్ ఫ్లైట్ కంట్రోల్ టెక్నాలజీ కోసం రూ.176 కోట్ల 99 లక్షలు, వీటి అనుసంధానానికి ఉపయోగించే ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కోసం రూ.14 కోట్ల 15 లక్షలను జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇన్వెస్ట్ చేస్తోంది. మొత్తం మూడు దశల్లో ఈ ఫైటర్ డ్రోన్స్ లేదా ప్లేన్స్ తయారు చేసేలా ప్లాన్ చేశారు. తొలి దశలో రిమోట్‌తో కంట్రోల్ చేసే ఫైటర్స్, రెండో దశలో ‘టీమింగ్’ ఆపరేషన్స్ అనగా.. ఒక ప్లేన్‌లో మనిషి ఉండి మిగతా వాటిని కంట్రోల్ చేసేలా, తుది దశలో మానవరహిత అనగా.. స్వతంత్రంగా పనిచేసే స్క్వాడ్రన్‌లు రూపొందించనున్నారు.