హీరోయిన్ సంచలన ప్రకటన.. ఆ ఛాంపియన్ బయోపిక్ చేయాలనుకుంటున్నా

by Shyam |   ( Updated:2021-10-12 05:21:13.0  )
హీరోయిన్ సంచలన ప్రకటన.. ఆ ఛాంపియన్ బయోపిక్ చేయాలనుకుంటున్నా
X

దిశ, సినిమా : వెండితెర ఆరంగేట్రం చేసిన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.. ప్రస్తుతం సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ చాలా బిజీ అయింది. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జాన్వీ ఓ ఆసక్తికర విషయం చెప్పింది. వికలాంగురాలిగా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి మహిళాగా రికార్డు క్రియేట్ చేసిన ‘అరునిమా సిన్హా’ బయోపిక్‌ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ఎన్నో కష్టనష్టాలను తట్టుకుని తను అనుకున్నది సాధించిన అరునిమా సిన్హా కథ అందరికీ తెలియాజేయాలనే ఉద్ధేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇక మాజీ వాలీబాల్ ప్లేయర్ అయిన అరునిమ ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్నప్పుడు ట్రైన్‌లో తన బ్యాగ్‌ను చోరీ చేయడానికి ప్రయత్నించిన దుండగులు ఆమెను ట్రైన్ నుంచి బయటకు తోసేయడంతో కాలు కొల్పోయింది. అయినా పట్టుదలతో 2013లో కృత్రిమ కాలుతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story