తిరుమలలో నటి జాన్వీ కపూర్.. సెల్ఫీ కోసం భక్తుల ఆరాటం (వీడియో)

by Anukaran |
తిరుమలలో నటి జాన్వీ కపూర్.. సెల్ఫీ కోసం భక్తుల ఆరాటం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో జాన్వీ కపూర్ స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుమలలో ఆమె సంప్రదాయ చీరకట్టులో, ముఖానికి మాస్క్ ధరించి కనిపించారు. ఆలయ అర్చకులు జాన్వీకి తీర్థ ప్రసాదాలు అందించారు. సడెన్‌గా జాన్వీ కనిపించడంతో అభిమానులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు. కానీ, ఆమె పెద్దగా ఆస్తకి చూపించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story