బాధిత కుటుంబాలకు జనసేన పరిహారం

by srinivas |
బాధిత కుటుంబాలకు జనసేన పరిహారం
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలోని కడపల్లిలో పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్​ షాక్​తో 3 జన సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, బాధిత కుటుంబాలకు జనసేన రూ. 13.25 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. పవన్ తరఫున జనసేన నాయకులు శుక్రవారం బాధిత కుటుంబీకులను కలిశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రాజేంద్రప్రసాద్, సోమశేఖర్, అరుణాచలం కుటుంబీకులను పరామర్శించి.. అనంతరం చెక్కులను అందజేశారు.

Advertisement

Next Story