ఆ జిల్లాకు సీతారామరాజు పేరు పెట్టాలి : జనసేనాని

by srinivas |   ( Updated:2020-07-04 11:47:08.0  )
Pawan
X

దిశ, వెబ్‌డెస్క్: జిల్లాల పునర్విభజనలో భాగంగా ఒక జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పెరుపెట్టాలని జనసేనాని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. శనివారం అల్లూరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. సీతారామరాజు పీడిత వర్గాల్లో చైతన్యం రగిలించి, భారతీయుల గుండెల్లో ధైర్యాన్ని నింపారని కొనియాడారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు అల్లూరి అని.. ఆయనను తెలుగు నెల ఎన్నటికీ మర్చిపోదని చెప్పారు. అలాగే ఆయన జన్మించిన పాండ్రంగి గ్రామాన్ని ఒక సందర్శనీయ క్షేత్రంగా అభివృద్ధి చేయాలన్నారు.

Advertisement

Next Story