జేపీ నడ్దాతో పవన్ కళ్యాణ్ భేటీ

by srinivas |   ( Updated:2020-11-25 06:39:38.0  )
జేపీ నడ్దాతో పవన్ కళ్యాణ్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత వపన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని నడ్డా నివాసంలో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై పవన్ నడ్డాతో చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీనుంచి ఉపసంహరించుకున్న జనసేన, బీజేపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరుగబోతున్న తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ ఢిల్లీ టూర్ ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story