- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ సారి ఐపీఎల్ కప్ మాదే : నీషమ్
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 12 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Kings XI Punjab) ఈ సారి కచ్చితంగా విజేతగా నిలుస్తుందని ఆ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆరేళ్ల కిందట ఐపీఎల్ ఆడిన ఈ న్యూజీలాండ్ క్రికెటర్ తిరిగి లీగ్‌లో వచ్చి చేరాడు. 2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (Present ‘Delhi Capitals’) తరపున ఆడిన నీషమ్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2019 చివర్లో జరిగిన వేలంలో అతడిని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Kings XI Punjab) జట్టు తీసుకుంది.
ప్రస్తుతం దుబాయ్‌లో జట్టుతో పాటు ఉన్న నీషమ్ తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నాడు. ‘రెండు నెలల పాటు జరిగనున్న సుదీర్ఘ టోర్నీ ఆడటం నాకు ఇదే తొలిసారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ఆరేళ్ల క్రితం ఐపీఎల్ ఎలా ఆడాలనే అవగాహన, అనుభవం లేదు. కానీ ఇప్పుడు ఒక బౌలర్‌గా టీ20 లీగ్స్ (T20 leagues)లో ఎలా ఆడాలనే దానిపై అవగాహన వచ్చింది. ఈ సారి జట్టు చాలా సమతూకంతో ఉన్నది. 13వ సీజన్ కచ్చితంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గెలుస్తుంది’ అని నీషమ్ చెప్పుకొచ్చాడు. ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్ సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుండగా.. తర్వాతి రోజే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.