- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రామనామ స్మరణలో ‘కమలం’.. ఆంజనేయ జపంలో ‘గులాబీ’
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాజకీయం ఆధ్యాత్మికత రంగు పులుముకుంటోంది. ఇన్ని రోజులు బీజేపీ జైశ్రీరాం పేరుతో నినాదాలు చేస్తుండగా.. ప్రస్తుతం గులాబీ పార్టీ ఆంజనేయ జపం మొదలుపెట్టింది.దీంతో టీఆర్ఎస్పార్టీ బీజేపీ ఉచ్చులో పడినట్టు అనిపిస్తోంది. రెండేండ్ల కింద చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు పాట్లు పడుతోంది. ఎన్నికల్లో అపజయం ప్రభావమా… హిందుత్వం నేపంతో బీజేపీ పాగా వేస్తుందనే భయమో తెలియదు కానీ టీఆర్ఎస్సైతం అదే దారిని ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. ఓ వైపు జై శ్రీరాం నినాదంతో బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే… టీఆర్ఎస్సైతం అలాంటి నినాదాన్నే తీసుకుంటోంది. ఇందుకు ఎమ్మెల్సీ కవిత బాధ్యతలు తీసుకుంటోంది. అందుకే గుళ్లు, గోపురాల వెంట తిరుగుతుండటమే గాక రాష్ట్రమంతా హనుమాన్‌చాలీసా పారాయణానికి శ్రీకారం చుడుతున్నది. బీజేపీ శ్రేణులు నమ్మకంగా కొలుస్తున్న భాగ్యలక్ష్మీ టెంపుల్‌ను ఇప్పుడు గులాబీ నేతలు సైతం సెంటిమెంట్‌గా తీసుకుంటున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ఆలయాలను దర్శించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయాన్ని మంత్రి ఇటీవలే దర్శించుకున్నారు. మొత్తంగా జై శ్రీరాం పేరుతో బీజేపీ.. జై హనుమాన్నినాదంతో టీఆర్ఎస్ రాష్ట్రంలో రాజకీయ స్మరణ చేస్తున్నాయి.
సమర్థించుకోవాలి మరి..
2018 శాసనసభ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్బీజేపీని విమర్శిస్తూ ‘హిందుగాళ్లు… బొందుగాళ్లు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో ‘మతం కడుపునింపుతదా…’ అంటూ మాట్లాడారు. ఇది రాష్ట్రంలో చాలా ప్రభావం చూపించిందని గులాబీ బాస్అనుమానిస్తున్నట్టు సమాచారం. ఆ తర్వాత పరిణామాల్లో దీన్ని సమర్థించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ బీజేపీ ఈ అంశాలనే ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్.. ఆ తర్వాత ఉప ఎన్నికలో సిట్టింగ్స్థానమైన దుబ్బాకను కొల్పోయింది. జీహెచ్‌ఎంసీలోనూ బోర్లా పడింది. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా సీట్లు సాధించింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ అవతరిస్తుందని టీఆర్‌ఎస్‌నేతల్లో గుబులు మొదలైంది. దీంతో కొంతమంది టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సైతం కాషాయం వైపు చూస్తున్నారు.
రంగంలోని ఎమ్మెల్సీ కవిత?
జై శ్రీరాం అంటూ బీజేపీ రాష్ట్రమంతా కలియతిరుగుతోంది. అటు ఆయోధ్య రామ మందిర నిర్మాణానికి చందాల విషయంలో టీఆర్ఎస్ఎమ్మెల్యేలు నోరు జారారు. అసలే గతంలో చేసిన వ్యాఖ్యలతో ఉక్కిరబిక్కిరి పడుతున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు నోరుజారడం మరింత ముదిరింది. దీన్ని బీజేపీ అవకాశంగా మార్చుకుంది. దీంతో ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ బాస్.. ఎమ్మెల్సీ కవితను రంగంలోకి దింపినట్లు పార్టీ వర్గాల్లో టాక్. అందుకే బీజేపీ సెంటిమెంట్అయిన భాగ్యలక్ష్మీ టెంపుల్నుంచి పుణ్యక్షేత్రాల యాత్రను కవిత మొదలుపెట్టింది. అనంతరం వారణాసీ కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకుంది. ఈ ఆ తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలను దర్శించుకునేందుకు ప్లాన్చేసుకుంది. ఇప్పటికే తొలుతగా కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకున్నారు. హనుమాన్‌చాలీసా చదివారు. జన్నేపల్లి శివాలయం ప్రారంభోత్సవానికి వేల మందితో దారి పొడవును నీరాజనాలు పట్టించే విధంగా చేశారు. ఆ తర్వాత ఈ నెల 9న మళ్లీ కొండగట్టుకు వెళ్లారు. అక్కడ రామకోటి స్థూపం నిర్మాణాన్ని ప్రారంభించారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వని గులాబీలు ఇప్పుడు వీటిపై ఫోకస్ పెడుతున్నాయి. జై హనుమాన్నినాదంతో హిందుత్వాన్ని తమవైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్‌చాలీసా పారాయణం కార్యక్రమానికి చేపట్టేందుకు కవిత రూపకల్పన చేశారు. బీజేపీ ట్రాప్‌లో ఉన్న హిందూ భక్తులు టీఆర్‌ఎస్ వైపు టర్న్అవుతారా అనేది సందేహమే. మంత్రి కేటీఆర్ సైతం ఫిబ్రవరి 1న వేములవాడను దర్శించుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఏడేండ్లుగా సిరిసిల్ల ఏరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ వేములవాడ ఆలయానికి వెళ్లి దర్శించుకున్న సందర్భం లేదు.