- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
46 ఏళ్ల వయసులో ప్రియురాలితో పెళ్లి పీటలెక్కిన ‘జైలర్’ నటుడు.. ఈ ఏజ్‌లో అవసరమా అంటూ కామెంట్స్
దిశ, సినిమా: నటుడు కమ్ కమెడియన్ రెడిన్ కింగ్‌స్లీ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘కోలమావు కోకిల’ అనే తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈయనకు.. తన ఫస్ట్ మూవీతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత నెల్సన్ తెరకెక్కించిన ‘వరుణ్ డాక్టర్’ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ఆ తర్వాత నెల్సన్ తెరకెక్కించిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు. అలా విజయ్ ‘బీస్ట్’, సూపర్ స్టార్ ‘జైలర్’ సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. కాగా కింగ్‌స్లీ గత ఏడాది తన 46 ఏళ్ల వయసులో ప్రియురాలు, నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అయితే గతంలో ఈ భామ క్రిష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక డివోర్స్ తర్వాత సంగీత కమెడియన్ రెడిన్ కింగ్‌స్లీతో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉండి లాస్ట్ ఇయర్ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే చాలా మంది ఈ వయసులో పెళ్లి అవసరమా.? కేవలం డబ్బు కోసమే అతన్ని పెళ్లి చేసుకున్నావ్ అంటూ సంగీతను తెగ ట్రోల్ చేస్తున్నారు. అలాగే కింగ్‌స్లీని ఉద్ధేశించి ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దీనిపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘మెంటల్‌గా నా వయసు 19, ఆయనకు 22 మేము ఇలానే ఫీలవుతున్నాం. నేను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నా అని అంటున్నారు. నేను ఆయన సింప్లిసిటీ చూసి పెళ్లి చేసుకున్నా.. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు’ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.