- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహదేవపూర్ కు మాడా కార్యాలయాల తరలింపు
దిశ, కాటారం : ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయంలోని మహాదేవపూర్ మడా ఆఫీసులన్నింటినీ మహాదేవపూర్ లోని రెవెన్యూ ఆఫీస్ పై అంతస్తుల్లో పున ప్రారంభించాలని ఐటీడీఏ నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఆఫీసులన్నింటినీ మహదేవపూర్ లో పున ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చేయకపోవడంతో పాటు మాడా కార్యాలయాన్ని ఐటీడీఏ గా అప్గ్రేడ్ చేయాలని ఈ ప్రాంత గిరిజనులు, ప్రజలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశారు. జలవినతులను పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యాలయాలను ఏటూరునాగారంకు తరలించారు.
దశాబ్దాల క్రితం మహాదేవపూర్ లో గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏ టి డి ఓ, మేనేజర్ గిరిజన కార్పొరేషన్ భూపాలపల్లి, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆఫీసును ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ కార్యాలయాన్ని దీప రెవెన్యూ కార్యాలయం అంతస్తు పై ఏర్పాటు చేయనట్టు ఐటిడిఏ ఆఫీస్ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంత గిరిజనులు తమ సమస్యలను విన్నవించేలా ప్రజావాణి కార్యక్రమాన్ని మాడా కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. మళ్లీ మాడా కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు కాటారం డివిజన్లోని ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.