- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడటం సిగ్గుచేటు.. మాజీ మంత్రి హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి(Chief Minister) స్థాయిలో ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు(BRS Leader Thanneeru Harish Rao) ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Session) జోరుగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హరీష్ రావు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడిన మాటలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఫార్ములా ఈ రేస్(Formula E-Race) వ్యవహరంలో నిధుల గోల్‌మాల్ జరిగిందని చెబుతున్న సీఎం మాటలకు ఆయన క్లారిటీ ఇచ్చిన వీడియోను జత చేశాడు. ఈ వీడియోలో.. 45 లక్షల పాండ్స్ చెల్లించనందుకు ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని ఏబీబీ ఫార్ములా కంపెనీ(Formula Company), ప్రభుత్వ అధికారి దానం కిశోర్(Dana Kishor) కి లేఖ రాశారని తెలిపారు. మొదటి 50 శాతం 45 లక్షల పాండ్స్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించామని, మిగిలిన 50 శాతం చెల్లించనందుకే ఆ కంపెనీ అగ్రిమెంట్ రద్దు చేసుకున్నదని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి ఆరు వందల కోట్ల నష్టం జరిగేదని అంటున్నారని, అక్కడ నష్టం కాదు.. లాభం జరిగేదని స్పష్టం చేశారు. కానీ, రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వందల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. దీనిపై రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గోబెల్స్ ప్రచారం చేసి సభా ప్రతిష్టకు భంగం కలిగించారని హరీష్ రావు విమర్శలు చేశారు.