వీటిలో నిల్వ చేసిన నీళ్లు వాడుతున్నారా.. ప్రమాదకరమని హెచ్చరిస్తోన్న నిపుణులు?

by Anjali |
వీటిలో నిల్వ చేసిన నీళ్లు వాడుతున్నారా.. ప్రమాదకరమని హెచ్చరిస్తోన్న నిపుణులు?
X

దిశ, వెబ్‌డెస్క్: భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తర్వాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు తాగునీరు సరఫరా చేయడం అనేక ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. నీరు లేకుండా భూమిపై జీవం ఉండదు. మొక్కలు, జంతువులు, మానవులందరూ నీటిని జీవించడానికి అవసరం.

ముఖ్యంగా వాటర్ లేకుండా పంటలు పండించలేం. వ్యవసాయం, ఆహార ఉత్పత్తికి నీరు చాలా ముఖ్యం. నీరు మన శరీరానికి అవసరమైనది. ఇది జీర్ణక్రియ (digestion), శ్వాస, శరీర ఉష్ణోగ్రత (body temperature)ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

అంతేకాకుండా.. పరిశ్రమలు (industries), పారిశ్రామిక ప్రక్రియలకు నీరు అవసరం, ఉదాహరణకు విద్యుత్ ఉత్పత్తి, గనుల ఉత్పత్తికి. కాగా నీటి వనరులను కాపాడటం చాలా ముఖ్యం. వర్షపు నీటిని సేకరించడం, నీటిని వృథాగా వాడుకోవడం నివారించండంటూ నిపుణులు చెబుతూనే ఉంటారు. ఇక ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటారన్న విషయం తెలిసిందే.

అయితే ఇంకా ఎండాకాలం రానేలేదు.. కానీ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఇటు గోదావరి, అటు కృష్ణానదీ జలాలు నుంచి తెలంగాణ రాష్ట్రానికి సరిపడ వాటర్ రావడం లేదు. ముఖ్యంగా పలు చోట్ల పట్టణాల్లో వాటర్ ప్రాబ్లమ్ తలెత్తుతుందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. కాగా కొంతమంది జనాలు డ్రముల్లో నీరు నిల్వ చేసి.. అదే నీటిని యూజ్ చేస్తుంటారు.

కానీ ఈ విధంగా వాడటం వల్ల ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. స్టోర్ చేసిన వాటర్‌లో క్రిములు తయారు అవుతాయి. అంతేకాకుండా కీటకాలు గుడ్లు పెడుతాయి. ఈ విధమైన వాటర్ ను వాడితే చర్మ వ్యాధులు (Skin diseases).. అలాగే (Malaria) బారిన పడే అవకాశం ఉంటుందని.. కాగా డ్రముల్లో నీటిని నిల్వ చేసి ఉపయోగించవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story

Most Viewed