BRS: అసెంబ్లీలో బీఆర్ఎస్ హంగామా

by Prasad Jukanti |
BRS: అసెంబ్లీలో బీఆర్ఎస్ హంగామా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లలో (Telangana Assembly) భాగంగా శుక్రవారం శాసనసభలో బీఆర్ఎస్ (BRS) సభ్యులు హంగామా (Hungama) సృష్టించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా ఇతర సభ్యులు మాట్లాడుతుండగా ఫార్ములా -ఈ కార్ రేస్ పై చర్చ జరపాలంటూ బీఆర్ఎస్ సభ్యులు చర్చను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని పేపర్లు విసిరేశారు. అంతటితో ఆగకుండా స్పీకర్ పోడియం వైపు తోసుకుంటూ పోవడంతో ఒక్కసారిగా సభలో తీవ్ర కలకలం రేగింది. హరీశ్ రావు (Harish Rao) తోటి సభ్యులను స్పీకర్ పోడియం వైపు తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లడం వైరల్ గా మారింది. వెంటనే మార్షల్స్ ప్రవేశించి బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.

Advertisement

Next Story