- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: కేటీఆర్‌తో పాటు మేమూ జైలుకెళ్తాం.. మాజీ ఎమ్మెల్యేల ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)ను అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు స్పందించారు. శుక్రవారం దాస్యం వినయ్ భాస్కర్(Dasyam Vinay Bhaskar), పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy)లు మీడియాతో మాట్లాడారు. KTRను అరెస్ట్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని కీలక ప్రకటన చేశారు. కేటీఆర్‌తో పాటు జైలుకు వెళ్లేందుకు తాము కూడా సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. ఫార్ములా-ఈ కార్ రేసింగ్(Formula-E car racing) వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.