అడవిలో హత్యకు గురైన మహిళ

by Kalyani |
అడవిలో హత్యకు గురైన మహిళ
X

దిశ, కాటారం : కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుసాపుర్ గ్రామ శివారులో మహిళ శవాన్ని పోలీసులు గుర్తించారు. శుక్రవారం సంఘటన స్థలాన్ని కాటారం డిఎస్పి జి రామ్మోహన్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రావు, సబ్ ఇన్స్పెక్టర్ మేకల అభినవ్ లు మహిళా మృతదేహాన్ని పరిశీలించారు. భూపాలపల్లి రూరల్ మండలంలోని అమలాపురం గ్రామానికి చెందిన కాల్వ శైలజ (30)గా గుర్తించారు. ఈనెల 17వ తేదీన కమలాపూర్ గ్రామం నుండి శైలజ సెల్ఫ్ బండలు తీసుకొస్తానని వెళ్లి తిరిగి రాకపోవడంతో మృతురాలి తల్లి కాల్వ దుర్గమ్మ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివాహం జరిగిన ఐదేళ్ల తర్వాత భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా విడిపోయి తల్లి దగ్గర కమలాపూర్ గ్రామంలో ఉంటుంది. అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఇనుగాల రమేష్ (45)తో ఉన్న అక్రమ సంబంధం కారణంగా అతడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లి దుర్గమ్మ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed