Assembly : ఫార్ములా-ఈ పై కేసు అక్రమమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్లకార్డుల ప్రదర్శన

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-20 07:08:26.0  )
Assembly : ఫార్ములా-ఈ పై కేసు అక్రమమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్లకార్డుల ప్రదర్శన
X

దిశ, వెబ్ డెస్క్ : శీతకాల అసెంబ్లీ(Assembly) సమావేశాల్లో రోజుకో సమస్యపై ఆందోళనలు..వేషధారణలతో నిరసనలు వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLAs)లు శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫార్ములా-ఈ రేసు కేసుపై తమ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కేటీఆర్ పై ఫార్ములా-ఈ రేసు కేసు అక్రమమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

అటు శాసన మండలి బీఆర్ఎస్ సభ్యులు సైతం కేటీఆర్ పై ఫార్ముల ఈ రేసు అక్రమ కేసు పెట్టారని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు, ఫ్లకార్డ్సు ధరించి నినాదాలకు సభకు హాజరయ్యారు. దీనిపై చర్చించాలని పట్టుబడుతు నినాదాలకు దిగారు. బీఏసీ ఎజెండాలో లేని అంశంపై చర్చకు అవకాశమిచ్చేది లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సభ్యులు నినాదాలు మాని బిల్లుల చర్చపై పాల్గొనాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టించుకోకపోవడంతో 15నిమిషాల పాటు సమావేశాలు వాయిదా వేశారు.

Advertisement

Next Story