- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
దిశ,బెల్లంపల్లి : ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల సర్వే కొనసాగుతుంది. ఇవాళ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఇండ్ల సర్వేను పరిశీలించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 16,1,4,11,14,20, వార్డుల్లో ఇంటింటి సర్వే కొనసాగుతుంది.
సర్వే ను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. ఇండ్ల సర్వే తీరుపై వార్డ్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను శ్రద్ధగా, ఎలాంటి తప్పులు లేకుండా చిత్తశుద్ధిగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, వార్డ్ కౌన్సిల్ సభ్యులు సూరం సంగీత, షేక్ ఆస్మా యూసుఫ్, ఎలిగేటి సుజాత శ్రీనివాస్, గోశిక రమేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.