- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యవసాయానికి దన్నుగా ఉంటాం : జగన్
దిశ, ఏపీబ్యూరో : ఏపీలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం రూ.4వేల కోట్లతో దన్నుగా నిలుస్తామని సీఎం జగన్ అన్నారు. రైతుల కోసం గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయాలన్నారు. రైతులు తమ పంట నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మించాలని భావిస్తున్నామని వివరించారు. 4వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌కు దన్నుగా నిలుస్తామన్నారు. తమ వద్ద పంట ఉందన్న విషయం రైతు ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం) అధికారులకు తెలిపితే ఆ విషయం వెంటనే సెంట్రల్ సర్వర్‌కు చేరాలని ఆయన సూచించారు. రైతు పండించిన పంటకు తానే ధర నిర్ణయించి, అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటునివ్వాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కనీస గిట్టుబాటు ధరలేని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. సెప్టెంబరు నాటికి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.